శ్రీ దత్త సుప్రభాతం
శ్రీ తాడేపల్లి
రాఘవ నారాయణ శాస్త్రి గారు దేవీ ఉపాసకులు మాత్రమే
కాదు.దత్త సాక్షాత్కారం
పొందినవారు కూడా.దత్త భాగవతం
కూడా రచించారు.దత్తుని అద్వైత స్థితిలో
మొదలుపెట్టి ద్వైత స్థితికి పయనించునట్లు రచించారు.మొత్తం ఆధ్యాత్మికతను కళ్ళ
ముందు నిలిపారు.
ఈ పంచదశి (15)సుప్రభాతం లో వారు దత్తాత్రేయ స్వామి ని వర్ణించిన
తీరు అద్భుతంగా ఉంటుంది.
ఈ సుప్రభాత పంచదశి (15)అనే శ్లోకాలలో అద్భుతంగా దత్తాత్రేయుని మన కళ్ళముందు నిలుపుతారు
1.సహ్యాచలాదిహసమాగతబంధురత్న రత్నప్రభాచ్ఛతనుకాoతి విరాజమాన |
మాన ప్రమాద మదవజ్జనతాదురాప ! దూరాపవర్జితన
వజ్జనమోహతే హమ్ |
భా: సహ్యాద్రి పర్వతం నుంచి వచ్చిన
బంధురత్నమా, రత్నప్రభ వలే స్వచ్ఛమైన శరీర
కాంతితో ప్రకాశించెడివాడా, *అభిమానం, పొరబాటు*, *అహంకారము మొదలగు*
*దుర్గుణములు కలవారికి* *అందనివాడా, నమస్కరించెడు భక్తుల మోహమును*
*పోగొట్టెడి ఓ దత్త దేవా! నేను నీ వాడను*🙏🏻🙏🏻🙏🏻
2.అత్రేస్సతీమణి రభూత్కిల సానసూయూ।
ప్రాసూత దత్తవపుషం భువి విష్ణు మేవ।
పౌరాణికీం తవ కథాం పరిశీలయన్మ ।
చిత్తం జహౌ తమ ఇతో మమ సుప్రబాతం ।
భావము:: అత్రి మునికి , పతివ్రతయగు అనసూయకు పుత్రునిగా విష్ణువే దత్త
వేషమున వచ్చెను. పురాణంలో వున్న ఈ కథను స్మరించినంతనే *నా చిత్తము* *అజ్ఞానమనే*
*చీకటిని వదిలివేసెను*. *ఈ కారణమువలననే నాకు సుప్రభాతం*.
3.దుర్జేయ దీవ్యదనఘానఘమూర్త మూర్తే।
శ్రీ కార్తవీర్యనృపసాత్కృత సర్వ విత్వ్త।
తస్యైవ దోర్దశశత ప్రవితీర్ణ విత్త ।
దత ప్రభో త్వదుదయే మమ సుప్రబాతం ।
భావము::🙏తెలుసుకొనుట
శక్యముగాని అపార మహిమ కలవాడా ! ప్రకాశించుచున్న అనఘా, అనఘుడు
అనే స్వరూపములను కలవాడా,
కార్తవీర్యార్జునికి సర్వజ్ఞత్వమును
కలిగించినవాడా, రెండు చేతులూ లేని కార్తవీర్యార్జునికి వెయ్యి
చేతులు అనుగ్రహించినవాడా, ఓ దత్త ప్రభో! నా
హృదయాకాశములో సూర్యుని వలె నీవు ఉదయించుటయే నాకు సుప్రభాతం. 🙏
4. సయ్సంగతో భయజయావభికాంక్షమాణం।
త్వత్పాద యుగ్మ పతితం కలయన్నలర్కం।సి
మదాలసేయమతియోగిదశామనైషిః1
దత్తప్రభో త్వదుదయే మమ సుప్రబాతం ।
భావము::🙏సత్సంగం, సత్పురుష సమాగమము వలన అభయమును, జయమును కోరుకున్న మదాలస కుమారడైన అలర్కునికి
యొగులకు మించిన దశను అనుగ్రహించితివి. సర్వ సమర్థుడవైన ఓ దత్తాత్రేయా! నా హృదయములో
నీనెప్పుడూ నిండియుండుటయే నాకు సుప్రభాతం. 🙏
5. జంభాసురేంద్ర సమరేషు పలాయితస్య!
వృత్రస్య హంతురభయంకరసతాముపేత్య!
తనైవ తం వినిహతం న చిరా దకార్షీః !
దత్త ప్రభో త్వదుదయే మమ సుప్రబాతం!
భావము::🙏 జంభాసురునిచే అనేక యుద్ధములలో
ఓడిపోయి, తనకు అభయము వేడిన వృత్తాసురుని చంపిన మహావీరుడైన
ఇంద్రునకు, అభయమిచ్చి, ఆ
ఇంద్రుని చేతనే జంభాసురుని చంపించితివి. ఓ దత్త ప్రభో! అటువంటి నీ యొక్క రక్షణ
నాకుండగా నాకు సుప్రభాతము గాక ఇంకేమి?
6...శ్రీ విష్ణు భక్తికృత జన్మమహత్త్వ
తత్త్వం!
ప్రహ్లాదమారచయ ఆత్మనిజాత్మ తత్త్వం!
తద్భోధనార్థమవధూతసవేషధారిన్!
దతప్రభో! త్వదుదయే మమ సుప్రబాతం ॥
భావము::🙏🏻పుట్టటతోటే
భగవంతుడైన విష్ణువు నందు భక్తి కలవాడైన ప్రహ్లాదునికి, అవధూత
వేషములో ఆత్మతత్త్వమును భోధించితివి. *ఓ దత్త ప్రభో! అటువంటి సర్వోత్తమత్వమును
వెల్లడించిన నీ వలననే నాకు సుప్రభాతం*.
7.తాతస్య శాప వశతో యదుమన్వయేన !
భ్రష్టం ప్రబుద్దమకరోధ్భువి వంశవంతం!
స్వాభిన్విరుద్దపద సంఘటనా పటీయః!
దత్త ప్రభో! త్వదుదయే మమ సుప్రబాతం ॥
భావము::🙏తండ్రి శాపము వలన
వంశము లేకుండా పోయిన యదుమహారాజును వంశము కలవాడుగా చేసితివి. వంశము లేకుండా పోయిన
వాని వంశములో భగవంతుడు అవతరించెను. ఓ స్వామి! సాధ్యము కాని పనులను కుదుర్చుటలో
నీవు సమర్ధుడవు. *ఓ దత్త ప్రభో, నా హృదయములో నీవు
ఉదయించుటయే నాకు సుప్రభాతం*.
8. ఆశావసాన ఉత పావనకృత్తివాసాః!
చీనాంశుక స్సహమణీ కనకాంబరశ్చ!
ఇచ్చా న దృశ్య స ఇదం విధ చిత్త వృత్తే!
దత్త ప్రభో త్వదుదయే మమ సుప్రబాతం!
భావము::🙏దిగంబరుడివిగా, పవిత్రమైన కృష్ణాజినాదులను ధరించినవాడవుగా,పట్టుగుడ్డలు కట్టినవాడిగా, రత్నములతో కూడిన బంగారు వస్త్రములు ధరించినవాడిగా, గడియకొకమాదిరిగా కన్పడుతున్నావు. నీకు దేనిమీదను
కోరికలేదు. ఇటువంటి *చిత్త వృత్తి గల ఓ దత్త ప్రభో, నీవు
ఎల్లవేళలా నాకు స్మరణలోనుండుటయే నాకు సుప్రభాతం*.
9.శ్రీ శంకరోదిత గణాగుణవీత భాతః !
రామానుజోక్త సగుణ ప్రగుణాత్మ మూర్తే!
సత్తార్థ కాస్తి పదలక్ష్య మహావిభూతే!
దత్త ప్రభో త్వదుదయే మమ సుప్రబాతం ॥
భావము::🙏శ్రీ
శంకరాచార్యులచే బోధింపబడిన గుణములు, అగుణములు రెండు
లేని పరమాత్మ స్వరూపము కలవాడా, రామానుజుని చేత
బోధింపబడిన అనంతకళ్యాణ గుణములు కల , గుణాతీతమైన
సగుణమూర్తి కలవాడా,
అత్రి అనసూయల భక్తికి మెచ్చి దయతో వారికి
పుత్రునిగా వచ్చితివి కనుక, దత్త ప్రభువనే
బిరుదు కలవాడా, అందరిలో ఆత్మగా వెలుగొందుతున్న మహావైభవము కలవాడా, *నా హృదయములో నీనెప్పుడూ వుండుటయే నాకు సుప్రభాతం*.
10. కృష్ణోజగాద కిల తత్త్వమిహార్జునాయ!
వ్యాసాయ నౌమి కిమిదం త్వితి సోఽపి మౌనీ!
కృష్ణో ఽహ మర్జునగురుర్మయి సన్నిధత్తే!
ధన్యోఽహమస్మి తదిదం మమ సుప్రభాతం ॥
భావము::🙏కృష్ణుడు
అర్జనునికొరకు గీతలో తత్త్వమును చెప్పెను. భూత,భవిష్యద్వర్తమానములు
తెలిసిన, మౌని అయిన వ్యాసుడు భారతములో వ్రాసిపెట్టెను.
*అర్జనునికి గురువైన కృష్ణుడే నాకు వ్యాసరూపములో తత్త్వమును చెప్పుచున్నాడు కనుక
నేను ధన్యుడను. ఈ విషయము తోచుటయే నాకు సుప్రభాతమగుట*.
11.ఏకత్వతో బహువిధత్వత ఆవిరీతం!
పశ్యన్నితస్తత ఇమం
గుణజాల భిన్నం!
దివ్యైర్వ సంతతిలకాబిధ పుష్పగుచ్చైః !
త్వాం మామపూపుజమహో మమ సుప్రబాతం!
భావము::🙏ఏకవిధముగాను,అనేకవిధములగాను లోకములో ఆవిర్భవించినవాడై,మాయ వలన వేరు వేరుగా కనపడుచున్న రెండు బింబములను
చూస్తున్న వాడనై దేవలోకమునకు సంబంధించిన ఉత్తమమైన వసంతతిలకములనే పూలగుత్తులతో
నిన్ను, నన్ను పూజించు కొనుచున్నాను.( అనగా అద్వైతములో
రెండు వస్తువులు లేవుకనుక నన్ను నేను పూజించుకొనుచున్నాను,అని
అర్థం). *భలే! ఇదే కదా నాకు సుప్రభాతం*
12.బ్రహ్మాస్తి నాస్తి యదివాఽస్య యతో భవాది!
తచ్ఛాస్త్రయోనిభవనాత్తు సమన్వయాత్తత్ !
సూత్రాణి శంకరగురోః పరిశీలకస్య!
తద్భాష్య సంశ్రవణతో మమ సుప్రభాతం ॥
భావము::🙏బ్రహ్మ ఉన్నది? లేదా? దాని గురించి మననము
చేయవలెనా? అవసరములేదా? బ్రహ్మమును
తెలుసుకొను ఉపాయము ఉన్నదా?లేదా? దేనినుంచి ఈ సమస్త విశ్వమంతా పుట్టినదో, దేనివలన పెరుగుతున్నదో, దేనియందు
లీనమగుతున్నదో అదియే బ్రహ్మము అని వేదములు చెప్పుచున్నవి. *బ్రహ్మము గురించి
వేదమార్గమున విచారించుట వలన, మననాదులతో
తెలుసుకొనుట వలన,
సమన్వయించుకొనుటవలన ముక్తి
ప్రకాశించుచున్నది. ఇటువంటి పరిశీలనాత్మకమైన శంకరుల భాష్యముయొక్క శ్రవణాదులవలన
నాకు సుప్రభాతం అయినది*.
13.ప్రజ్ఞానమోం 12.బ్రహ్మాస్తి నాస్తి యదివాఽస్య యతో భవాది!
తచ్ఛాస్త్రయోనిభవనాత్తు సమన్వయాత్తత్ !
సూత్రాణి శంకరగురోః పరిశీలకస్య!
తద్భాష్య సంశ్రవణతో మమ సుప్రభాతం ॥
భావము::🙏బ్రహ్మ ఉన్నది? లేదా? దాని గురించి మననము
చేయవలెనా? అవసరములేదా? బ్రహ్మమును
తెలుసుకొను ఉపాయము ఉన్నదా?లేదా? దేనినుంచి ఈ సమస్త విశ్వమంతా పుట్టినదో, దేనివలన పెరుగుతున్నదో, దేనియందు
లీనమగుతున్నదో అదియే బ్రహ్మము అని వేదములు చెప్పుచున్నవి. *బ్రహ్మము గురించి
వేదమార్గమున విచారించుట వలన, మననాదులతో
తెలుసుకొనుట వలన,
సమన్వయించుకొనుటవలన ముక్తి ప్రకాశించుచున్నది.
ఇటువంటి పరిశీలనాత్మకమైన శంకరుల భాష్యముయొక్క శ్రవణాదులవలన నాకు సుప్రభాతం
అయినది*. యథాఽయమాత్మా !
బ్రహ్మేతి తత్త్వమసి చ శ్రుతయశ్చతస్రః !
వాక్యైశ్చతుర్భిరముమర్ధిమిహైక మేవ !
ప్రాబోధయన్ హతతమాః మమ సుప్రభాతం॥
భావము::🙏 ఓం అనగా*
*బ్రహ్మవాచకము. ప్రజ్ఞానం బ్రహ్మ అనగా**అఖండజ్ఞానమే బ్రహ్మ* *అని
అర్థం*బ్రహ్మోహమస్మి అనగా ఆ బ్రహ్మము నేనే అయి వున్నాను అని*, అయమాత్మా బ్రహ్మ అనగా ఈ ఆత్మయే బ్రహ్మ అని ,తత్వమసి అనగా ఆ బ్రహ్మమే నీవు అని అర్థం. ఈ నాలుగు
వేద వాక్యములు ఒకేరకమైన అర్థమును కలిగి వున్నాయి. ఈ వేద ప్రభోధము వలన నా అజ్ఞానము
నశించినది*. కనుక నాకు సుప్రభాతం*.
14.ఊర్ధ్వై రధోముఖ గతైశ్చ మయూఖజాలైః !
చద్రం చ వహ్ని మపి చోజ్జ్వలయన్ సహంసం!
అంతర్భహిశ్చ దివి కారణకార్య రూపే!
నిత్యం చ కాస్తి కుత ఏతదసుప్రభాతం ॥
భావము::🙏ఒక్కడే సూర్యుడు, లోపల హృదయాకాశములో మరియూ బయట కనపడే ఆకాశములో
ఊర్ధ్వముగా ( పైకి) పోవు కిరణములలో,చంద్రుని ద్వారా
కిందకి ప్రసరించు కిరణములలో, భూమి పైన వున్న
అగ్ని మండలము నందు,
సహస్రారములో వ్యాపించి ఉన్న మేధా రూప
చంద్రమండలమందు, స్వాధిష్టానములో వ్యాపించి ఉన్న అగ్ని మండలము నందు, రాత్రి, పగలు భేదము లేకుండా
జ్ఞాని దృష్టి లో ఒకే ఆకారముతో నిత్యమూ ప్రకాశించుచున్నాడు. *అందువలన నాకు
సుప్రభాతం లేకపోవుట ఎక్కడిది. ఎప్పుడూ సుప్రభాతమే*.
15.విత్తం న విత్త మథవోక్త మిదం హి కోఽహం!
నారాయణ స్సదపి చిచ్చ న కార్యహర్షః!
భానం న భాన మపి నో న చ దేశకాలౌ!
కోఽపి స్వయం సహజపూర్ణ రసోహమస్మ్యోమ్ ॥
భావము::🙏 నాకు తెలిసినది ఏదీ
లేదు. నేనెవడను? నారాయణుడను. సచ్చిదానందస్వరూపుడను. విషయవాసనలు
లేని ఆనంద స్వరూపమును. వెలుగు లేదు చీకటి లేదు. దేశకాలములు లేవు. తెలుసుకొనవలసిన
ద్వితీయ వస్తువు లేదు కనుక అజ్ఞానము లేదు. సూర్యుడుకి చీకటి లేనట్లు. (
బ్రహ్మమునందు ఇవి వుండవు అని అర్థం). అయితే నీ వెవరవు? అనగా
మనోవాక్కులకు అందని వాడను, నిజరూపముతో
స్వభావసిద్ధమైన సహజ అనుభవస్వరూపుడను , ఓం కార తత్వం తో
సూచించబడే వస్తువును.
No comments:
Post a Comment